
Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి కొన్ని సీన్లు తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు ఐదేళ్ల శ్రమ ఫలితంగా తెరపైకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం జూలై 24న భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా విడుదలైన తర్వాత కొందరు ప్రేక్షకులు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలపై సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఈ విమర్శలను గమనించిన చిత్రబృందం వెంటనే చర్యలకు దిగింది. వీఎఫ్‌ఎక్స్ ప్రమాణాలు సరిగా లేకపోయిన కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించడంతో పాటు, కొన్ని సన్నివేశాల్లో చిన్నచిన్న మార్పులు కూడా చేసింది.
Details
కొన్ని సీన్లు కుదింపు
ఉదాహరణకు, పవన్ కళ్యాణ్ తన అనుచరులతో కలిసి కొండపై గుర్రాలపై చేసే సన్నివేశాన్ని కుదించారు. అలాగే, ఒక ముఖ్యమైన జెండా సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు. పవన్ బాణాలు సంధించే యాక్షన్ సీన్‌లోనూ కొంత మేరకు మార్పులు చేశారు. క్లైమాక్స్ సీన్ నిడివిని కూడా గణనీయంగా తగ్గించారు. ఈ మార్పుల కారణంగా మొత్తం 10 నుండి 15 నిమిషాల ఫుటేజీ సినిమా నుంచి తొలగించారు. ప్రస్తుతం థియేటర్లలో ఈ సవరించిన వెర్షన్ ప్రదర్శితమవుతోంది. అయితే ఈ ఎడిటింగ్ మార్పుల గురించి చిత్రబృందం అధికారికంగా ఏమైనా ప్రకటించలేదు.