తదుపరి వార్తా కథనం

Sonu Sood: ఈడీ విచారణకు హాజరు సోనూసూద్ హాజరు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 24, 2025
01:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
సినీనటుడు సోనూసూద్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వ్యవహారంలో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందుగానే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూసూద్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు ఆయనను బెట్టింగ్ యాప్‌లకు చేసిన ప్రచారం, వాటితో ఉన్న సంబంధం, తీసుకున్న రుసుములు తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇందులో సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, మంచు లక్ష్మి, రానా వంటి ప్రముఖులు ఇటీవల ఈడీ విచారణకు హాజరయ్యారు.