LOADING...
SonuSood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్‌ చికిత్స..
మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్‌ చికిత్స..

SonuSood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్‌ చికిత్స..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

వెండితెరపై ప్రతినాయక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు. సామాజిక సేవలతో ముందడుగు వేసిన ఆయన, తాజాగా తన 'సూద్ చారిటీ ఫౌండేషన్' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 500 మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు చేయించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. వైద్య సహాయం అందించడమే కాకుండా, ప్రాణాపాయంలో ఉన్న ఆ మహిళలకు కొత్త జీవితం అందించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. ఈ కార్యక్రమంపై స్పందించిన సోనూసూద్.. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే తన ప్రధాన ఆశయమని తెలిపారు. ఈ విజయం తనతో పాటు పనిచేసిన బృందం, వైద్యుల అంకితభావం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.

వివరాలు 

500 మంది వృద్ధుల కోసం సౌకర్యాలతో కూడిన ఆధునిక వృద్ధాశ్రమం 

ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో రొమ్ము క్యాన్సర్ లేని భారతదేశం లక్ష్యంగా మరిన్ని విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2025లో తన 52వ జన్మదినం సందర్భంగా 500 మంది వృద్ధుల కోసం సౌకర్యాలతో కూడిన ఆధునిక వృద్ధాశ్రమాన్ని ప్రకటించిన ఆయన, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో ప్రతిష్టాత్మక 'హ్యూమానిటేరియన్ అవార్డు'ను సైతం అందుకున్నారు. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవగాహన కోసం కృషి చేస్తున్న సోనూసూద్ సేవలను చూసి యావత్ భారతదేశం ప్రశంసలతో ముంచెత్తుతోంది.

Advertisement