Page Loader
Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్  
Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్ Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్

Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్  

వ్రాసిన వారు Stalin
Jun 01, 2024
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్వయంభు' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు భరత్ కృష్ణమాచారి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. నిఖిల్ కత్తి దూస్తున్న స్టిల్ బాగా ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. మంచి యాక్షన్, ధ్రిల్ల్లర్ సీన్లను చిత్రీకరిస్తున్నారు భరత్ కృష్ణమాచారి. కాగా, ఈ సినిమాలో మరో స్టార్ టెక్నీషియన్ జాయిన్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Details 

ఈ సినిమా కోసం ప్రముఖ స్టార్ సినిమాటోగ్రఫర్

ఆస్కార్ అవార్డ్ జ్యూరీ మెంబర్, ప్రముఖ స్టార్ సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు 'స్వయంభూ' యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అందుకే సెంథిల్ లాంటి సినిమాటోగ్రఫర్ అయితే, తన పనితనంతో ఈ సినిమా విజువల్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తాడని టీమ్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ యాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Details 

మార్షల్ ఆర్ట్స్‌లో నిఖిల్ ట్రెయినింగ్ 

కాగా, ఈ సినిమా కోసం పలు రకాల మార్షల్ ఆర్ట్స్‌లో నిఖిల్ ఇప్పటికే ట్రెయినింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. స్వయంభూ మూవీలో అందాల భామలు సంయుక్త మీనన్, నభా నటేష్‌లు ఫీమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.