Naga Chaitanya Birthday: నాగచైతన్యకు వెంకటేశ్ స్పెషల్ బర్త్‌డే విషెస్.. ఫొటో షేర్ చేస్తూ ఏమన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హీరో వెంకటేష్ తన మేనల్లుడు, అక్కినేని నాగచైతన్యకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ చైతూ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. నాగచైతన్యతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. నీకు ఎల్లప్పుడూ అంతులేని ఆనందం, మంచి ఆరోగ్యం, అపారమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సైతం నాగచైతన్యకు బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
వివరాలు
డిసెంబర్ 4న 'వృషకర్మ'తో చైతూ సందడి
నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'వృషకర్మ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వివరాలు
సంక్రాంతికి వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా
మరోవైపు వెంకటేశ్ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే ఈ సినిమాలోని 'డివికి డివికి' పాటను విడుదల చేయగా.. అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా వెంకటేశ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, నాగచైతన్య వెంకటేశ్ సోదరి లక్ష్మి కుమారుడనే విషయం తెలిసిందే.