Page Loader
మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల 
మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేసిన ఉపాసన

మెగా ప్రిన్సెస్ కు ప్రత్యేక గది: ఫారెస్ట్ థీమ్ తో ఇంటీరియర్ డిజైన్; వీడియో విడుదల 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 14, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పాపకు క్లింకార అని పేరు పెట్టారు. పాపకు నాన్నమ్మ, తాతయ్యలతో మంచి బంధం ఏర్పడాలన్న ఉద్దేశ్యంతో చిరంజీవి ఇంటికి రామ్ చరణ్ దంపతులు షిఫ్ట్ అయ్యారు. అయితే మెగా ప్రిన్సెస్ క్లింకార కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు ఉపాసన వెల్లడి చేసారు. పాప పెరిగే వాతావరణం ఆహ్లాదంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆ గదిని ఫారెస్ట్ థీమ్ ఇంటీరియర్ తో నింపేసారు. ఆర్క్ డైజెస్ట్ ఇండియా వారు ఈ గదిని అనేక రకాల పిల్లల వస్తువులతో అందంగా మార్చేసారు. ప్రస్తుతం ఈ గది వీడియోను ఉపాసన షేర్ చేసారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మెగా ప్రిన్సెస్ కోసం ప్రత్యేక గది