NTR: అభిమానులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ బర్త్‌డే మ్యాష్‌అప్
వ్రాసిన వారు
Sirish Praharaju
May 20, 2026
12:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్‌పై పలువురు ప్రముఖులు చేసిన ప్రశంసలను ఒకేచోట చేర్చుతూ రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. ఓ సందర్భంలో దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్‌కు అన్నీ తెలుసని చెప్పగా, మరో ప్రముఖుడు ఆయనకు ఇంకెవరితోనూ పోలికే లేదంటూ ప్రశంసలు కురిపించారు. ఇలా ఎన్టీఆర్‌పై వచ్చిన విశేష వ్యాఖ్యలను సమీకరించి శ్రేయస్ మీడియా ప్రత్యేక మ్యాష్‌అప్ వీడియోను విడుదల చేసింది. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదలైన వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ స్పెషల్ మ్యాష్‌అప్ వీడియో అదిరిపోయిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరూ చూసేయండి..