LOADING...
PEDDI : 'పెద్ది'లో స్పెషల్ సాంగ్.. చరణ్‌తో స్టెప్పులేయనున్న మృణాల్ ఠాకూర్!
'పెద్ది'లో స్పెషల్ సాంగ్.. చరణ్‌తో స్టెప్పులేయనున్న మృణాల్ ఠాకూర్!

PEDDI : 'పెద్ది'లో స్పెషల్ సాంగ్.. చరణ్‌తో స్టెప్పులేయనున్న మృణాల్ ఠాకూర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం. ఆ పాటలో రామ్ చరణ్‌తో కలిసి ఎవరు కనిపిస్తారన్నది గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైంది. తాజా సమాచారం ప్రకారం, టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఈ స్పెషల్ సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

Details

ఆఫర్ ను తిరస్కరించిన రష్మిక మంధన్న

చరణ్‌తో కలిసి మృణాల్ వేసే డాన్స్ స్టెప్పులు థియేటర్లలో ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకొస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొదట ఈ అవకాశాన్ని రష్మిక మంధానకు ఆఫర్ చేసినప్పటికీ, ఆమె తిరస్కరించడంతో ఈ ఛాన్స్ మృణాల్‌కు దక్కినట్లు సమాచారం. మృణాల్ అందం, రామ్ చరణ్ డాన్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. మరోవైపు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పెద్ది' టీజర్‌ను మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు 'కుస్తీ' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Details

ఏప్రిల్ 30న రిలీజ్

టీజర్‌లో రామ్ చరణ్ తన రగ్గడ్ లుక్‌తో పాటు రెజ్లింగ్ విన్యాసాలతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మధ్య నాటికి షూటింగ్ సహా అన్ని పనులను పూర్తి చేసి, ప్రమోషన్లను వేగవంతం చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.

Advertisement