Page Loader
Vishwambhara: విశ్వంభరలో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు
విశ్వంభరలో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు

Vishwambhara: విశ్వంభరలో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర'లో కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి నటించగా, దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠ నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో త్రిష,ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. మిగిలిన భాగం కేవలం ఒక ప్రత్యేక గీతం మాత్రమే ఉన్న నేపథ్యంలో, నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం తుదిదశలో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం,ఈ సినిమాలో ఇప్పుడు మిగిలిన ఆ ఒక్క ప్రత్యేక పాటను తెరకెక్కించే పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.

వివరాలు 

స్పెషల్ సాంగ్‌కు  సంగీతం భీమ్స్‌ సిసిరోలియో

నిజానికి ఈ చిత్రానికి సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నప్పటికీ, ఈ స్పెషల్ సాంగ్‌కు మాత్రం సంగీతం అందించేది భీమ్స్‌ సిసిరోలియో కావచ్చని సమాచారం. ఈ పాటలో చిరంజీవి సరసన నటించే కథానాయిక ఎంపికపై ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ప్రతిదీ అనుకున్న విధంగా జరిగితే, జూలై నెలలో ఈ పాటను చిత్రీకరించే అవకాశముందంటున్నారు. ఇక ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు పూర్తయ్యే దశలో ఉండటంతో, చిత్రబృందం విడుదల తేదీపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక అంశాలను కలగలిపిన ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో చిరంజీవి ఇప్పటివరకు కనిపించని విధంగా, ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు.