NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హ్యాపీ బర్త్ డే రంభ: తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రత్యేక పాటలు 
    తదుపరి వార్తా కథనం
    హ్యాపీ బర్త్ డే రంభ: తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రత్యేక పాటలు 
    హ్యాపీ బర్త్ డే రంభ

    హ్యాపీ బర్త్ డే రంభ: తన కెరీర్లో గుర్తుండిపోయే ప్రత్యేక పాటలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 05, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    1990వ దశకంలో కుర్రకారును కిర్రెక్కించిన హీరోయిన్ రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

    అప్పట్లో ఆమెను శ్రీదేవి చెల్లి అనేవారు. కొంతమంది దివ్యభారతిలా ఉందన్నారు. ఈరోజు రంభ పుట్టినరోజు.

    హీరోయిన్ గా తెలుగు, తమిళం చిత్రాలు ఎక్కువగా చేసింది రంభ. మొత్తం 7ప్రాంతీయ భాషల్లో ఆమె నటించింది.

    హీరోయిన్ గా దూసుకుపోతూనే స్పెషల్ సాంగ్స్ లో మెరిసేది రంభ. ప్రస్తుతం రంభ చేసిన స్పెషల్ సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.

    Details

    చిరంజీవితో సమానంగా స్టెప్పులు వేసిన రంభ 

    చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

    పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోని ఈ పాటలో స్టెప్పులు వేసింది రంభ. ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసారు.

    కన్నెపెట్టరో కన్నుకొట్టరో- హలో బ్రదర్

    ఈవీవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జునతో డ్యాన్స్ చేసింది రంభ. ఈ పాటలో ఇంద్రజ, ఆమని కూడా కనిపిస్తారు.

    హే రుక్కు రుక్కుమ్యాన్ - ఇద్దరు మిత్రులు

    చిరంజీవి నటించిన ఈ సినిమాలో రంభ కనిపించింది. చిరంజీవితో సమానంగా రంభ వేసే స్టెప్పులు అందరినీ అలరిస్తాయి. మృగరాజు సినిమాలో రామయ్య పాదాలెట్టి అనే ప్రత్యేక పాటలోనూ చిరంజీవితో డ్యాన్స్ చేసింది రంభ.

    Details

    నవతరం హీరోల సినిమాల్లో రంభ 

    నాయుడోరి పిల్లా - నాగ

    జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాలో నాయుడోరి పిల్లా, నా ఇంటికొస్తావా అనే పాటకు నర్తించింది రంభ. ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ యమదొంగ సినిమాలో, నాచోరే నాచోరే అనే పాటలో మరోమారు ప్రత్యేక గీతంలో కనిపించింది.

    అట్టాంటోడే ఇట్టాంటోడే - దేశముదురు

    అల్లు అర్జున్ హీరోగా కనిపించిన ఈ మూవీలోని మాస్ పాటలో కనిపించింది రంభ.

    గత కొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ, 2010లో మలేషియాకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్ళిచేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుట్టినరోజు
    తెలుగు సినిమా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు  సినిమా
    మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు  మహేష్ బాబు
    ఐఫా అవార్డ్స్ 2023: ఉత్తమ నటుడిగా హృతికరోషన్: అవార్డులు గెలుచుకున్నవారి జాబితా ఇదే  సినిమా
    హరిహర వీరమల్లు సినిమాకు అనుకోని దెబ్బ: షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025