Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' స్టోరీ లైన్ వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా
రణబీర్ కపూర్,రష్మిక మందన్న,బాబీ డియోల్,అనిల్ కపూర్ నటించిన యాక్షన్ డ్రామా 'యానిమల్'తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన తర్వాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న'స్పిరిట్' చిత్రీకరణను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభాస్, వంగ స్పిరిట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సాలార్ 2 ప్రకటనతో స్పిరిట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ వంగా వెల్లడించారు.
'స్పిరిట్' హారర్ కాదు..సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ: సందీప్ వంగా
బాలీవుడ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ వంగా తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్‌తో చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ ''సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథతో స్పిరిట్ సినిమా చేస్తున్నాను. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది హారర్ డ్రామా కాదు. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నాను. ప్రభాస్ నటించిన స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్" ఉంటుందని సందీప్ వంగా పేర్కొన్నాడు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ పాన్ ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు. యానిమల్ విజయంతో, భారతదేశం అంతటా స్పిరిట్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ క్యారెక్టర్‌ని సందీప్ రెడ్డి వంగా ఎలా డిజైన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.