LOADING...
Squid Game 2 Trailer: స్క్విడ్ గేమ్ 2.. మరింత థ్రిల్‌, సస్పెన్స్‌తో ట్రైలర్ విడుదల!

Squid Game 2 Trailer: స్క్విడ్ గేమ్ 2.. మరింత థ్రిల్‌, సస్పెన్స్‌తో ట్రైలర్ విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2024
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'కు కొనసాగింపుగా త్వరలో 'స్క్విడ్ గేమ్ 2' రానుంది. 2021లో విడుదలైన మొదటి సీజన్ ఘన విజయం సాధించగా, దీని సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ 2 ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు, ప్రస్తావించినట్లు, భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడాని కోసం మరోసారి గేమ్‌లో భాగమవుతారు. మొదటి సీజన్‌లో బయటపడిన 456వ పోటీదారు సియోంగ్ గి-హున్ తిరిగి ఈ ఆటలో పాల్గొనడం ప్రారంభిస్తాడు. అతను గేమ్‌ను ఆపాలని ప్రయత్నిస్తుంటాడు. ప్రమాదకరమైన గేమ్స్, గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి ఆటలతో మరిన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.

Details

డిసెంబర్ 26న రిలీజ్

సియోంగ్ గి-హున్ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా, ప్రమాదకరమైన ఆటల నుండి అతని ఇష్టం వచ్చిన వారిని కాపాడగలిగాడా అనే ప్రశ్నలకు సమాదానం దొరకాలంటే డిసెంబర్ 26 వరకు ఆగాల్సిందే. 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లో 456 మంది, జీవితంలో కోల్పోయినదంతా తిరిగి పొందేందుకు ఒక రహస్య దీవిలోకి తీసుకెళ్ళుతారు. అక్కడ చిన్నపిల్లల ఆటలు, తదితర పోటీలలో పాల్గొని, గెలిచే వారు భారీ నగదు బహుమతిని గెలుచుకుంటారు. ఈ సిరీస్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినప్పటికీ, ప్రేక్షకుల నుండి విశేష ఆదరణను అందుకుంది. 12 ఏళ్ల పోరాటంతో ఈ సిరీస్‌ను సిద్ధం చేసిన మేకర్స్, 12 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వీక్షణలను సాధించినట్లు తెలిపారు. 'స్క్విడ్ గేమ్'కి ఈ విజయం అందించిన ప్రేక్షకులందరికీ మేకర్స్ ధన్యవాదాలు తెలిపారు.