సామజవరగమన అంటూ సరికొత్తగా వస్తున్న శ్రీ విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో శ్రీ విష్ణు తన కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రేమికుల రోజున సామజవరగమన టైటిల్ తో సరికొత్తగా వస్తున్నాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంగీత వాయిద్యం వీణను చేతిలో పట్టుకుని శ్రీ విష్ణు కూర్చుంటే, ఆ వీణతో పాటు అతన్ని తాళ్ళతో కట్టివేసి, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రెబా మోనికా అతని చుట్టూ నిల్చుని ఉన్నారు.
పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ కామెడీ అని క్లియర్ గా తెలిసిపోతుంది.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను రాజేష్ దండ నిర్మిస్తున్నారు.
సామజవరగమన
బిగిల్ ఫేమ్ రెబా మోనికా హీరోయిన్ గా సామజవరగమన
తమిళ చిత్రమైన బిగిల్ మూవీలో నటించి పేరు తెచ్చుకున్న రెబా మోనికా, సామజవరగమన చిత్రంలో హీరోయిన్ గా కనిపిస్తుంది.వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.
కమెడియన్ సత్య హీరోగా వచ్చిన వివాహ భోజనంబు సినిమాకు దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజు, సామజవరగమన చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
సినిమా పోస్టర్ తప్ప కథకు సంబంధించిన ఇతర విషయాలేవీ వెల్లడి చేయలేదు. కాకపోతే నవ్వుల పువ్వులు పూయించే సినిమా అనీ తెలియజేసారు. దాంతో ఈ సినిమా మీద అందరికీ ఆసక్తి కలిగింది.
గత కొన్ని రోజులుగా వరుసగా ఫ్లాపులు మూటగట్టుకున్న శ్రీ విష్ణు, ఈసారైనా సామజవరగమన సినిమాతో సరైన హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.