వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం
ఈ వార్తాకథనం ఏంటి
అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. కానీ గతకొన్ని రోజులుగా సరైన విజయాలు లేక అవస్థలు పడుతున్నాడు.
గాలిసంపత్, అర్జున ఫల్గుణ, భళా తందనాన, అల్లూరి చిత్రాలు బాక్సాఫీసు దగ్గర అపజయాలుగా మిగిలాయి. తాజాగా శ్రీ విష్ణు నుండి మరో సినిమా రాబోతుంది.
ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రేపు ఉదయం 11:07నిమిషాలకు చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.
శ్రీ విష్ణు నుండి వస్తున్న కొత్త సినిమాలో తమిళ బిగిల్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన రేబా జాన్ హీరోయిన్ గా కనిపిస్తుంది.
తెలుగు సినిమా
కామెడీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం
ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు వివాహ భోజనంబు సినిమాను డైరెక్ట్ చేసారు. కరోనా లాక్ డౌన్ కాలం నేపథ్యంలో వచ్చిన వివాహ భోజనంబు, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.
తన రెండో సినిమాను శ్రీ విష్ణుతో మొదలెట్టిన రామ్ అబ్బరాజు, ఈ సారి థియేటర్ కోసం సినిమా తీస్తున్నాడు. కామెడీ, లవ్ ప్రధానాంశాలుగా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది.
గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీ బ్యానర్స్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సమర్పకులుగా వ్యవహరిస్తుంది. కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనేది ఇంకా తెలియలేదు.
ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో చూడాలి.