Sreeleela: టాలీవుడ్‌కి దూరమౌతున్న కుర్చీపాప... కారణం ఇదేనంటున్న శ్రీలీల
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో సందడి చేసిన శ్రీలీల ఈ మధ్య తెలుగు తెరపై పెద్దగా కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు కూడా తగ్గడంతో ఆమె తెలుగు సినిమాలకు దూరమవుతోందా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అభిమానుల్లో ఈ ప్రశ్న ఆసక్తి రేపుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన శ్రీలీల అసలు కారణాన్ని వెల్లడించింది. టాలీవుడ్‌కు దూరం కావాలనే ఉద్దేశం తనకు లేదని, వ్యక్తిగత చదువు కారణంగానే కొత్త తెలుగు సినిమాలను అంగీకరించలేకపోయానని స్పష్టం చేసింది.
Details
రెండేళ్లు ముంబయిలోనే.. అందుకే కొత్త సినిమాలకు బ్రేక్!
శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో పాటు తన వైద్య విద్యపైనా దృష్టి పెట్టింది. మెడిసిన్ చదువు, ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉండటంతో సుమారు రెండేళ్లపాటు ముంబయిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
ఈ కారణంగా తెలుగు సినిమా షూటింగులకు సమయం కేటాయించడం కష్టమైందని చెప్పింది. అందుకే కొత్త ప్రాజెక్టులను తగ్గించుకోవాల్సి వచ్చిందని వివరించింది.
అంతేతప్ప టాలీవుడ్‌పై అసంతృప్తి లేదని, తెలుగు సినిమాలకు దూరమవుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
Details
సినిమాల ఎంపికలో ఇప్పుడు చాలా జాగ్రత్త!
తన సినీ ప్రయాణం గురించి కూడా శ్రీలీల ఆసక్తికర విషయాలు పంచుకుంది. చాలా చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించానని తెలిపింది.
అప్పట్లో సినిమా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళ్లేదాన్నని చెప్పింది. కథల ఎంపిక విషయంలో తనకు పెద్దగా స్వేచ్ఛ ఉండేది కాదని గుర్తుచేసుకుంది.
అయితే కొన్ని సినిమాల తర్వాత ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో అర్థమైందని వివరించింది.
Details
జయాపజయాలతో పాఠాలు నేర్చుకున్న భామ
సినిమాల ఫలితాలు తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని శ్రీలీల అభిప్రాయపడింది. గతంలో కంటే ఇప్పుడు కథ, పాత్ర, తన కెరీర్‌కు ఉన్న ప్రాధాన్యం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పింది.
అందుకే సినిమాల సంఖ్య కంటే మంచి అవకాశాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శ్రీలీల టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడం లేదు.
చదువు, ఇంటర్న్‌షిప్ కారణంగా తాత్కాలికంగా వేగం తగ్గించిన ఈ బ్యూటీ, మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.