
గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుండి శ్రీలీల లుక్ ని రిలీజ్ చేసారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ లుక్, ఆకట్టుకునే విధంగా ఉంది.
ఎరుపు రంగు మిర్చి చీరలో గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఎవరో పిలుస్తుంటే ఏంటన్నట్టుగా చూస్తూ కూర్చున్న శ్రీలీల ఫోటోను రిలీజ్ చేసారు.
చెవులకు ఊగుతున్న జుంకీలు, విరబోసుకున్న జుట్టు, సున్నాలా మార్చిన పెదవులు, కారం రంగు గాజులతో అలంకరించి ఉంది శ్రీలీల.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే మరో హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను 2024 జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల లుక్
Here’s wishing the extremely talented & gorgeous @sreeleela14 a very Happy Birthday! 🤩 - Team #GunturKaaram 🔥🌶️#HBDSreeLeela ✨
— Haarika & Hassine Creations (@haarikahassine) June 14, 2023
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine pic.twitter.com/pPFBZ9EQUf