
ధమాకా బ్యూటీకి లక్కీ ఛాన్స్: రవితేజతో మళ్ళీ నటించనున్న శ్రీలీల?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది. వరుసగా ఆమె చేస్తున్న సినిమాల లిస్టు చూస్తే ఎవరికైనా మతిపోతుంది.
భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో శ్రీ లీల కనిపిస్తోంది.
తాజాగా ఆమె ఖాతాలో మరో సినిమా చేరిందని సమాచారం. అది కూడా రవితేజ హీరోగా చేస్తున్న సినిమా కావడం విశేషం.
ఇదివరకు రవితేజ, శ్రీలీల కలిసి ధమాకా సినిమాలో నటించారు. రవితేజ ఎనర్జీకి ఈక్వల్ గా శ్రీలీల డాన్సులు చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ జోడి మళ్లీ వెండితెర మీద కనువిందు చేయబోతుందని అంటున్నారు.
Details
RT 4 GM సినిమాలో శ్రీలీల?
రవితేజతో మూడు సినిమాలు తెరకెక్కించిన గోపీచంద్ మలినేని, రవితేజతో నాలుగవ సినిమా తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.
RT 4 GM అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఆల్మోస్ట్ హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయిపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
రవితేజ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల మళ్లీ కనిపిస్తుందని వార్తలు వస్తున్నప్పటి నుండి మాస్ మహారాజ అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ప్రస్తుతం రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా మొదలు అవుతుందని అంటున్నారు.