
ఉస్తాద్ టీజర్: భయాన్ని ఎదిరించి గాల్లో ఎగిరిన యువకుడి కథ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెరకెక్కిన చిత్రం ఉస్తాద్. తాజాగా ఉస్తాద్ టీజర్ విడుదలైంది.
చిన్నప్పటి నుండి విమానాలను చూస్తూ గాల్లో ఎగరాలనుకునే ఒక యువకుడు, తనకున్న సమస్యల కారణంగా గాల్లో ఎగరలేకపోతాడు. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలంటే అతనికి భయం.
కానీ అతనికి గాల్లో ఎగిరి ఆకాశాన్ని అందుకోవాలన్న కోరిక ఉంటుంది. అదే, పైలట్ అవ్వాలని అనుకుంటాడు. ఎత్తైన ప్రదేశాలంటే భయపడే పాత్ర, పైలట్ కావడానికి ఏం చేసాడనేదే కథ అని టీజర్ చూస్తే అర్థమైపోతుంది.
తను పైలట్ అయ్యే ప్రాసెస్ లో ఇంట్లో వాళ్ళ నుండి పెద్దగా ప్రోత్సాహం లభించదు. అందరూ అతన్ని నిరుత్సాహ పరిస్తున్నట్లుగా టీజర్ లో చూపించారు.
Details
హీరోయిన్ గా కావ్యా కళ్యాణ్ రామ్
టీజర్ లో కనిపించిన దాని ప్రకారం, ఉస్తాద్ సినిమాలోని పాత్రలో శ్రీ సింహా ఒదిగిపోయినట్లుగా అనిపిస్తోంది. వర్టిగో సమస్యతో బాధపడేవాడిగా, ఆ తర్వాత తన భయాన్ని గెలిచినవాడిగా సరిగ్గా సరిపోయాడు.
ఇక ఉస్తాద్ టీజర్ లో హీరోయిన్ పాత్రను పెద్దగా చూపించలేదు. కాకపోతే రెండు మూడు షాట్స్ లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్, శ్రీ సింహాకు జోడీగా సరిగ్గా సరిపోయింది.
లీడ్ రోల్స్ మధ్య ప్రేమకథను టీజర్ లో పెద్దగా రివీల్ చేయలేదు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకానొక షాట్ లో మెరుస్తాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.