రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విజేతలను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా సత్కరించినట్టు ఇప్పటివరకు కనిపించలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆ లోటును తీర్చేసారు. ఆర్ఆర్ఆర్ బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి, ఆస్కార్ విజేత కీరవాణిని శాలువాతో సన్మానించారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పార్టీలో ఈ సన్మానం జరిగింది. ఈ పార్టీకి ఆర్ఆర్ఆర్ బృందంలోని రాజమౌళి, డీవీవీ దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కీరవాణి హాజరయ్యారు. ఈ సన్మానం తాలూకు ఫోటోలను తన సోషల్ అకౌంట్స్ లో పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఆర్ఆర్ఆర్ బృందాన్ని సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి
కనబడని చంద్రబోస్
భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ బృందం మొత్తాన్ని శాలువాలతో సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ కార్యక్రమంలో నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ కనిపించలేదు. ఆస్కార్ విజేతలు సన్మానించిన మొదటి ఫిలిమ్ పర్సనాలిటీగా మెగాస్టార్ నిలిచారు. మెగాస్టార్ తర్వాత మరికొంత మంది సినిమా సెలెబ్రిటీలు, ఆర్ఆర్ఆర్ బృందాన్ని సత్కరించే అవకాశం ఉందని అర్థమవుతోంది. అదలా ఉంచితే రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. చాలామంది హాజరయ్యారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన తర్వాతి చిత్ర టైటిల్ ని రిలీజ్ చేసారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.