Page Loader
వైరల్ వీడియో: నాటు నాటు పాటకు టెస్లా కార్ లైట్ల తో సింక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
నాటు నాటు పాట బీటుకు టెస్లా కార్ లైట్లతో సింక్

వైరల్ వీడియో: నాటు నాటు పాటకు టెస్లా కార్ లైట్ల తో సింక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 20, 2023
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట రీచ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ పాటకు స్టెప్పులు వేయని వారు లేరంటే అతిశయోక్తి కాదు. స్టెప్పులు వేయడమే కాదు, స్టెప్పులు వేసే స్టైల్ లోనూ క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. తాజాగా న్యూజెర్సీలో టెస్లా కార్ లైట్లను నాటు నాటు పాటకు సింక్ చేసిన వీడియో, ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. పాట బీటుకు తగినట్లుగా, టెస్లా కార్ లైట్లు ఆన్ అవడం, ఆఫ్ కావడం చూస్తుంటే వావ్ అంటారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సోషల్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. 95వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ పాట విభాగంలో, నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాటు నాటు పాట బీటుకు టెస్లా కార్ లైట్లతో సింక్