తదుపరి వార్తా కథనం
ఆస్కార్ తర్వాత ఎమ్ఎమ్ కీరవాణికి గిఫ్ట్ ఇచ్చిన రిచర్డ్ కార్పెంటర్
వ్రాసిన వారు
Sriram Pranateja
Mar 16, 2023
04:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న సమయంలో, కార్పెంటర్స్ పాటను గుర్తుచేస్తూ, టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ ఆస్కార్ వేదిక మీద తన మాటలను పాట రూపంలో చెప్పుకొచ్చాడు కీరవాణి.
ఈ నేపథ్యంలో, ఎమ్ఎమ్ కీరవాణికి, రిచర్డ్ కార్పెంటర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆస్కార్ అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణి, చంద్రబోస్ లకు అభినందనలు చెబుతూ, టాప్ ఆఫ్ ద వరల్డ్ పాటను పాడుతూ పియానో వాయించారు రిచర్డ్ కార్పెంటర్. అది కూడా తన ఫ్యామిలీతో కలిసి పాడటం విశేషం.
ఈ వీడియోను చూసిన కీరవాణి, అసలు ఇది ఊహించలేదని, తన కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు, రిచర్డ్ ఇచ్చిన సర్ప్రైజ్, అతిపెద్ద బహుమతి అని చెప్పుకొచ్చాడు.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి