Page Loader
Mrithyunjay : శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్‌! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల
శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్‌! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల

Mrithyunjay : శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్‌! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్‌ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'మృత్యుంజయ్'. ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను, శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా, చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌ను గమనిస్తే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. 'గేమ్ ఓవర్', "నేను అయిపొయిందనే వరకు అవ్వదు" వంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లతో టీజర్‌ను కట్‌ చేశారు. వీటిని చూస్తుంటే సినిమా ఉత్కంఠ రేకెత్తించేలా ఉండబోతుందని అర్థమవుతోంది.

Details

సంగీతాన్ని అందించనున్న కాల భైరవ

ఈ చిత్రాన్ని సందీప్‌ గుణ్ణం, వినయ్‌ చిలకపాటి నిర్మిస్తున్నారు. అలాగే అయ్యప్ప శర్మ, వీర్‌ ఆర్యన్‌, సుదర్శన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం కాలభైరవ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విద్యాసాగర్ చేపట్టారు. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో మృత్యుంజయ్‌ కొత్త అనుభూతిని పంచుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్