Page Loader
సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు
సామజవరగమన గ్లింప్స్ రిలీజ్

సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 28, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాక్టర్ శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం సామజవరగమన. వివాహ భోజనంబు సినిమాతో మెప్పించిన రామ్ అబ్బరాజు, ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈరోజు శ్రీ విష్ణు బర్త్ డే సందర్భంగా సామజవరగమన గ్లింప్స్ విడుదలైంది. గ్లింప్స్ చూస్తుంటే ఇదొక విచిత్రమైన ప్రేమకథా చిత్రమనీ, ఆద్యంతం నవ్వులు తెప్పించే చిత్రంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రపంచంలో ఏ ప్రేమకీ రాని సమస్య తనకు వచ్చిందని శ్రీ విష్ణు పాత్ర అనుకుంటుంది. కానీ ఆ సమస్యేంటో గ్లింప్స్ లో వెల్లడి చేయలేదు. కాకపోతే ఏదో సరికొత్త సమస్యతో ఈ ప్రేమకథ నడవనుందని అర్థమవుతోంది. హీరోగా శ్రీ విష్ణు పాత్ర కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది.

సామజవరగమన

వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న సామజవరగమన

హీరోయిన్ రెబా జాన్ మోనికా కేవలం ఒక్క ఫ్రేమ్ లో మాత్రమే కనిపించింది. కానీ అందంగా మెరిసింది. మిగతా పాత్రల్లో కమెడియన్ సుదర్శన్ కనిపించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంగా వచ్చిన వివాహ భోజనంబు సినిమాతో నవ్వులు పూయించిన రామ్ అబ్బరాజు, ఈ సినిమాతో మరోమారు అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఐతే వివాహ భోజనంబు చిత్రం ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు సామజవరగమన చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, రాజేష్ దండ నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ సమర్పకులుగా ఉన్నారు. సామజవరగమన చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.