
శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ఇండస్ట్రీలో హీరో, విలన్, కామెడీ ఇలా ఒకటి కాకుండా అన్ని పాత్రలో మెప్పించిన అరుదైన నటుడు హీరో శ్రీకాంత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలకు పైగా నటించిన అద్భుతమైన నటుడు.
కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా కొన్ని అరుదైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడాదికి అరడజను సినిమాలు చేసే శ్రీకాంత్.. ఇప్పటికి బీజి ఆర్టిస్టే. 1968 మార్చి 23న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతిలో శ్రీకాంత్ జన్మించాడు. చిన్ననాటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి మరింత ఇన్స్పైర్ అయ్యాడు.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే చిరంజీవికి నమ్మినబంటుగా మారిపోయి.. అతడి తమ్ముడు లిస్టులో చేరిపోయాడు.
శ్రీకాంత్
నెగిటివ్ పాత్రలో మెప్పించిన శ్రీకాంత్
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం కష్టపడ్డ శ్రీకాంత్.. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో తొలిసారి స్క్రీన్ మీద కనిపించాడు.
కెరీర్ మొదట్లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయిగారు, వారసుడు లాంటి చాలా సినిమాల్లో నెగిటివ్ పాత్ర చేశాడు. తొలిసారిగా వన్‌బైటు సినిమాతో హీరో అయ్యాడు. రామానాయుడు నిర్మించిన తాజ్‌మహల్ సినిమాతో క్రేజీ హీరో అయ్యాడు
వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, మా నాన్నకి పెళ్లి, కన్యాదానం, ప్రేయసి రావే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు శ్రీకాంత్ ను తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. శ్రీకాంత్ ఇలాగే ఇండస్ట్రీలో అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.