Sreeleela: శ్రీలీల-తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన తల్లి
ఈ వార్తాకథనం ఏంటి
నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్‌లో ఉన్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు తాజాగా మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో శ్రీలీల తల్లి స్వర్ణలత ఈ అంశంపై స్పందించి స్పష్టతనిచ్చారు. ఆమె ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ, అవి అవాస్తవం, నిరాధారని తేల్చిచెప్పారు. ఇలాంటి కథలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారంలో అణువంత కూడా నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీలీల తన చదువుతో పాటు నటనలో కూడా చాలా బిజీగా ఉన్నారని తెలిపారు. ఆమెకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నీట్-పీజీ పరీక్షకు ప్రిపరేషన్ తీసుకుంటోందని వెల్లడించారు.
వివరాలు
అవన్నీ పుకార్లు మాత్రమే
వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడానికి ఆమెకు ఇంకా ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం ఉందని స్పష్టం చేశారు. 2025 డిసెంబర్‌లో శ్రీలీల, తిలక్ వర్మ కలిసి తిరుమల దర్శనం చేసుకోవడం, అలాగే వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలీల హాజరుకావడం వంటి ఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగినవి కాదని స్వర్ణలత తెలిపారు. వీటి ఆధారంగా అనవసరమైన కథనాలు సృష్టించవద్దని ఆమె మీడియా, సోషల్ మీడియాను కోరారు. ఇంతకుముందు కూడా శ్రీలీలపై ఇలాంటి వార్తలు వచ్చాయని, అప్పుడూ తానే ఖండించినట్లు ఆమె గుర్తు చేశారు.
వివరాలు
అనవసరంగా రిలేషన్ కథనాలను సృష్టిస్తున్నారు
ముఖ్యంగా బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ప్రచారాన్ని కూడా ఆమె అప్పట్లో తిప్పికొట్టారు. కార్తిక్ ఆర్యన్ తల్లి, తాను ఇద్దరూ గైనకాలజిస్టులమని, వృత్తిపరంగా మాత్రమే పరిచయం ఉందని ఆమె తెలిపారు. ఆ వృత్తిపరమైన పరిచయాన్ని ఆధారంగా తీసుకుని మీడియా అనవసరంగా రిలేషన్ కథనాలు సృష్టించిందని స్వర్ణలత స్పష్టం చేశారు.