
శ్రీమంతుడు యూట్యూబ్ వ్యూస్: మహేష్ బాబు నటించిన సినిమాకు తిరుగులేని రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం 2015లో విడుదలై మంచి విజయం అందుకుంది.
అప్పట్లో 100కోట్ల కలెక్షన్లు సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం తాజాగా యూట్యూబ్ లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఇప్పటివరకు యూట్యూబ్ చరిత్రలో ఏ తెలుగు సినిమాకు రాని వ్యూస్ శ్రీమంతుడు దక్కించుకుంది. యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ మైలురాయిని చేరుకున్న తొలి తెలుగు చిత్రంగా శ్రీమంతుడు నిలిచింది.
శ్రీమంతుడు చిత్రాన్ని 2017 సెప్టెంబర్ 13వ తేదీన మైత్రీ మూవీ మేకర్స్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది.
Details
ఐదేళ్ళ తర్వాత 200మిలియన్ల వ్యూస్
అప్లోడ్ చేసిన ఐదేళ్ల తర్వాత శ్రీమంతుడు సినిమా 200మిలియన్ల వ్యూస్ అందుకుని తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది.
శ్రీమంతుడు సినిమాకు 8.3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అత్యధిక వీక్షణలు అందుకున్న చిత్రంగా శ్రీమంతుడు నిలవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో, జగపతిబాబు ముఖేష్ రిషి, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.