Loading...
Dasara: దసరాపై క్రేజీ హీరోల కన్ను.. మూకుమ్మడిగా పండగ బరిలోకి!
దసరాపై క్రేజీ హీరోల కన్ను.. మూకుమ్మడిగా పండగ బరిలోకి!

Dasara: దసరాపై క్రేజీ హీరోల కన్ను.. మూకుమ్మడిగా పండగ బరిలోకి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 28, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది దసరా సినీ ప్రేక్షకులకు భారీ విందు ఇవ్వబోతుందా? చూస్తుంటే సంక్రాంతి సీజన్‌ను తలపించేలా క్రేజీ హీరోల సినిమాలన్నీ దసరా పండగపైనే కన్నేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు దసరా రేసులో ఉండగా.. తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న 'రణబలి' కూడా ఈ పోటీలో చేరింది. మరి ఈ దసరాకు ఏయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఏ సినిమాల మధ్య పోటీ ఉండనుంది? విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'రణబలి' ముందుగా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే హీరోయిన్ రష్మిక గాయపడటంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. దీంతో అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయడం సాధ్యం కాలేదు.

వివరాలు

దసరా రేసులో 'జైలర్'

ప్రస్తుతం రష్మిక కోలుకోవడంతో ముందుగా 'రణబలి' బ్యాలెన్స్ షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

సినిమా మరింత ఆలస్యం కాకుండా అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' కూడా దసరా రేసులో ఉంది. అందరికంటే ముందుగానే ఈ సినిమాపై దసరా రిలీజ్‌కి కర్చీఫ్ వేసింది చిత్రబృందం.

వాస్తవానికి 'జైలర్ 2' జూన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎవరొచ్చినా.. ఎవరు రాకపోయినా దసరాకు థియేటర్లలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.

అక్టోబర్ 20న దసరా పండగ ఉండగా.. ఐదు రోజుల ముందుగానే అంటే అక్టోబర్ 15న 'జైలర్ 2' విడుదల కానుంది.

వివరాలు

అక్టోబర్ 2న రిలీజ్

ఇక వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాను 2026 సమ్మర్‌లోనే విడుదల చేయాలని తొలుత భావించారు.

అయితే షూటింగ్ పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే దసరా సెలవులను పూర్తిగా క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 20న దసరా పండగ ఉండటంతో.. 18 రోజుల ముందే అంటే అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయానికి చిత్రబృందం వచ్చినట్లు సమాచారం.

దీంతో 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

వరుసగా పెద్ద మూవీస్ రిలీజ్

ప్రస్తుతం అక్టోబర్ 15న 'జైలర్ 2', అక్టోబర్ 16న 'రణబలి' సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.

దీంతో ఈ రెండు సినిమాలు విడుదలయ్యే వారంలో కాకుండా.. వారం ముందుగానే 'ఆదర్శ కుటుంబం'ను తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అక్టోబర్ 9న విడుదల చేస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఈ ఏడాది దసరా బరిలో వరుసగా క్రేజీ సినిమాలు నిలవడంతో.. ఈ పండగ సీజన్ కూడా సంక్రాంతి తరహాలో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు వేదిక కానున్నట్లు కనిపిస్తోంది.

ADVERTISEMENT