Page Loader
Spirit : 'స్పిరిట్‌' లో స్టైలిష్ ఐటెం సాంగ్.. హీరోయిన్ ఎవరంటే?
'స్పిరిట్‌' లో స్టైలిష్ ఐటెం సాంగ్.. హీరోయిన్ ఎవరంటే?

Spirit : 'స్పిరిట్‌' లో స్టైలిష్ ఐటెం సాంగ్.. హీరోయిన్ ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెబల్ స్టార్ ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్‌. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకే సమయంలో జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తి కాగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' సినిమా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగ గతంలో అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి హిట్లతో పాపులర్ అయ్యారు.

Details

ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ లో స్పిరిట్

యానిమల్ సినిమాతో రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 'స్పిరిట్‌' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ప్రారంభమైంది. ఈ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కియారా అద్వానీతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ విన్పిస్తోంది. ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ హీరోయిన్‌ ఎవరో ఇంతవరకు క్లారిటీ రాలేదు.