Page Loader
Harom Hara Movie: హరోం హరా అంటూ గర్జించనున్న సుధీర్ బాబు
హరోం హరా అంటూ గర్జించనున్న సుధీర్ బాబు

Harom Hara Movie: హరోం హరా అంటూ గర్జించనున్న సుధీర్ బాబు

వ్రాసిన వారు Stalin
May 21, 2024
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

హరోం హరా అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ,సుధీర్ బాబు వచ్చే నెలలో గర్జించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది . ఆయన నటించిన మూవీ మే 31 న విడుదల కావాల్సి ఉంది. ఏ కారణం వల్లో జూన్ 14 కి వాయిదా పడింది. ఈ కొత్త తేదీని మేకర్స్ ఇవాళ ప్రకటించారు. కొంత కాలంగా సుధీర్ బాబుకి సరైన హిట్లు లేక సతమతమవుతోన్నారు. ఆయన పుట్టిన రోజు నాడు విడుదలైన మురుగన్ సాంగ్ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంది. సుధీర్ బాబు గన్ పట్టుకుని గర్జించే వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

Details 

ప్రత్యేక పాత్రలో సునీల్

ఈ వీడియో చిత్రంపై ప్రేక్షకులకు మరింత ఆసక్తిని రేపేలా ఉంది. సునీల్ ఓ ప్రత్యేక పాత్రలో సుధీర్ బాబు స్నేహితుడిగా అలరించనున్నారు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జి నాయుడి సమర్పణలో ఈ మూవీని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తుంది. చైతన్ భరధ్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుధీర్ బాబు చేసిన ట్వీట్