
Sudigali Sudheer: పాన్ వరల్డ్ మూవీలో హీరోగా సుడిగాలి సుధీర్.. టైటిల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మెజీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేశాడు, వాటిలో కొన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఇప్పుడు సుధీర్ కెరీర్‌లో ఐదవ మూవీ అనౌన్స్‌మెంట్ రాబోతోంది. రేపు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుడిగాలి సుధీర్ ఇప్పటివరకూ చేసిన నాలుగు సినిమాలు తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి. ఈసారి పాన్ ఇండియా కాకుండా, పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారంటూ ప్రకటన వచ్చింది. రామ్ చరణ్ అభిమానిగా పిలిచే శివ చెర్రీ 'రామ్ చరణ్ యువశక్తి' అనే సంస్థ స్థాపించి, మెగా అభిమానుల్లో గుర్తింపు పొందారు.
Details
ప్రచారంలో 'హైలెస్సో' టైటిల్
ఈ సినిమా ద్వారా శివ చెర్రీ నిర్మాతగా పరిచయమవుతున్నారు. టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు, కానీ కొన్ని విదేశీ భాషలలో టైటిల్‌ను రాసి షేర్ చేశారు. ప్రేక్షకులను డీకోడ్ చేయమని కోరారు. సినీవర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు 'హైలెస్సో' అని టైటిల్ ఉన్నట్లు అనుకుంటున్నారు. డీకోడ్ కోసం ఇచ్చిన ఫోటోలో, కత్తికి గజ్జలు కట్టి చూపించారు. ఈ సినిమా వజ్రవారాహి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమా అంటే, ఇండియన్ భాషలతో పాటు ఇతర ఫారెన్ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేయడం అవసరం. మరి సుధీర్ సినిమాను విదేశీ భాషల్లో రిలీజ్ చేస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం.