
Suhas : 'మండాడి' పోస్టర్ విడుదల.. ఊరమాస్ లుక్‌లో సుహాస్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
ట్యాలెంట్‌తో పాటు కంటెంట్ పరంగా మెప్పించే చిత్రాలను ఎంచుకుంటున్న నటుడు సుహాస్ ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
కోలీవుడ్ నటుడు సూరి సరసన ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మండాడి'. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మతిమారన్ తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలవడంతో సోషల్ మీడియా వేదికగా హీట్ పెరిగింది. విడుదలైన పోస్టర్‌లో సుహాస్ పూర్తిగా ఊరమాస్ గెటప్‌లో కనిపించాడు.
పొడవాటి జుట్టు, గడ్డం, టీషర్టు-లుంగీ కాంబినేషన్‌లో కనిపించిన అతని లుక్ బోల్డ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంది.
పైగా అతని టీషర్టుపై 'టీ సునామీ రైడర్స్' అనే పదాలు ఉండటంతో ఈ సినిమా గ్రామీణ క్రీడల నేపథ్యంలో నడుస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Details
రగ్డ్ అవతారంతో సుహాన్
ముఖ్యంగా కబడ్డీ వంటి గేమ్ చుట్టూ కథ సాగనుందని సమాచారం. మరో పోస్టర్‌లో సుహాస్, సూరి ఇద్దరూ సముద్రంపై పడవలో కూర్చొని గంభీరంగా కనిపిస్తున్నారు.
ఈ రెండు పోస్టర్లు అభిమానుల నుంచే కాక సినీ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు ఈ తరహా లుక్‌లో కనిపించని సుహాస్, తన రగ్డ్ అవతారంతో సరికొత్త వింధనను ఇస్తున్నాడు.
ఇది సినిమా మీద మరింత ఆసక్తి పెంచుతోంది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఈ చిత్రంపై పెద్దగా సమాచారం వెలువడకపోయినా, ఈ ఒక్క పోస్టర్‌తోనే సుహాస్ దృష్టిని తనవైపు తిప్పించుకున్నాడు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ నుంచి ఈసారి 'మండాడి' ద్వారా ఇంకెంత బలమైన పెర్ఫార్మెన్స్ వస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.