Page Loader
Prasanna Vadanam OTT: ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ను ఫిక్స్ చేసుకున్న'ప్రసన్న వదనం'  
ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ను ఫిక్స్ చేసుకున్న'ప్రసన్న వదనం'

Prasanna Vadanam OTT: ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ను ఫిక్స్ చేసుకున్న'ప్రసన్న వదనం'  

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2024
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారిన సుహాస్ అటు తరువాత'రైటర్ పద్మభూషణ్','అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'వంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టాడు. సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం'అనే థ్రిల్లర్ మూవీ ఈ రోజు విడుదలైంది. అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌. రాశీసింగ్,నందు,వైవా హర్ష,సాయి శ్వేత,నితిన్ ప్రసన్న కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫికైన‌ట్లుగా ఓ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫాం 'ఆహా' ఈ సినిమా డిజిటల్ హక్కులను మంచి మొత్తానికి సొంతం చేసుకుంది.