Loading...
Sumanth: థియేటర్లలోకి రానున్న 'న్యూటన్స్‌ థర్డ్‌ లా'
థియేటర్లలోకి రానున్న 'న్యూటన్స్‌ థర్డ్‌ లా'

Sumanth: థియేటర్లలోకి రానున్న 'న్యూటన్స్‌ థర్డ్‌ లా'

వ్రాసిన వారు Moogati Shabari
Jul 18, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

'అనగనగా' చిత్ర విజయానంతరం ఈటీవీ విన్‌ బ్యానర్‌పై సుమంత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'న్యూటన్స్‌ థర్డ్‌ లా' ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె. హరీశ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్‌ రత్నం, రవి వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

వివరాలు

ప్రేక్షకులను అలరించనున్న క్రైమ్ థ్రిల్లర్..

ఈ సినిమాను ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ప్రకటనలో, ''ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను ఊహించిన దానికంటే ముందుగానే అనుభవిస్తున్నాం.

ఈ ఏడాది బెస్ట్‌ థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది'' అని పేర్కొంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ఇతర ప్రమోషనల్‌ కంటెంట్‌ను బట్టి చూస్తే, 'న్యూటన్స్‌ థర్డ్‌ లా' వినూత్న కథాంశంతో రూపొందిన మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT