
Sundaram Master review: సుందరం మాస్టర్ .. అద్భుతం చేస్తాడని ఆశిస్తున్న అందరిని నిరాశపరిచాడు
ఈ వార్తాకథనం ఏంటి
హాస్యనటుడు హర్ష చెముడు సుందరం మాస్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించారు.
ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ తన ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై నిర్మించారు. దింతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
Details
సుందరానికి ఎమ్మెల్యే చెప్పిన పని ఏంటి..
Story : సుందరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిర్యాలమెట్ట అనే గ్రామానికి ఇంగ్లీష్ టీచర్ గా వెళతాడు.
ఆ ఊరికి రాగానే ఆ గ్రామస్తులు ఇంగ్లీషులో మాట్లాడుతారని తెలుసుకుని సుందరం ఆశ్చర్యపోతాడు.
ఇలాంటి తరుణంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) అతనికి ఒక ఆసక్తికరమైన పని అప్పు చెబుతాడు.
సుందరం ఆ పని ఎలా పూర్తి చేయగలిగాడు, గ్రామంలో ఉన్న సమయంలో అతను ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథ.
Performances: హర్ష చెముడు మొదటి సారి లీడ్ రోల్ లో నటించాడు. సుందరం గా చాలా బాగా చేసాడు.
దివ్య శ్రీపాద నటన బాగుంది, బాలకృష్ణ నీలకంఠపురర్, ఇతర నటీనటులు గ్రామస్థులుగా కనిపించారు.
Details
సెకండ్ హాఫ్ పై ఆసక్తి
Analysis: సినిమా ప్రథమార్ధం తేలికగా సాగి, కథాంశాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తుంది.
ఇంటర్వెల్ ఎపిసోడ్ ముందు వరకు నవ్వించిన సుందరం ఆ తరువాత అంత నవ్వించలేదు.
ద్వితీయార్ధం కొంచెం సీరియస్‌గా ఉండడమే కాకుండా.. ఫిలాసఫీ ఎక్కువ అయిపోయి ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు కన్ఫ్యుస్ అయ్యాడు.
Positives: మొదటి హాఫ్ లో సుందరం మాస్టర్ గురించి, అతడు పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు.
ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవ్వడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం కూడా బాగుంది.
Details
అర్ధం కానీ సుందరం మాస్టర్ చెప్పిన కథ
Negatives: ఒక పాయింట్ తర్వాత, కథ నెమ్మదిగా సాగుతుంది. ప్రీ-క్లైమాక్స్ పార్ట్ మెరుగ్గా ఉంది, అయితే సుందరం మాస్టర్ ఇంకేదో అద్భుతం చేస్తాడని ఆశించేలోపు అందరిని నిరాశపరిచాడు.
చివరికి సోషల్ మెసేజ్ ఇచ్చి సినిమాని ముగించే ప్రయత్నం చేశారు.
conclusion: ఏది ఏమైనప్పటికి సుందరం మాస్టర్ చెప్పిన కథ పూర్తిగా అర్థం కాలేదు.