LOADING...
JSJ : విజయ్‌ వారసుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా కొత్త సినిమా!
విజయ్‌ వారసుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా కొత్త సినిమా!

JSJ : విజయ్‌ వారసుడు జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా కొత్త సినిమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కుమారుడు జాసన్‌ విజయ్‌ డైరెక్టర్‌గా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్‌ స్కూల్‌లో ఫిల్మ్‌మేకింగ్‌ నేర్చుకున్న జాసన్‌, ఇప్పటికే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ దర్శకత్వం వహించి అనుభవం సంపాదించాడు. ఇప్పుడు ఆ అనుభవంతో కోలీవుడ్‌లో ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా అడుగుపెడుతున్నాడు. తన తొలి చిత్రంలో హీరోగా తెలుగు నటుడు సందీప్‌ కిషన్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల సందీప్‌ కిషన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ, నేడు ఈ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు.

Details

'SIGMA' అనే టైటిల్‌ ఖరారు

ఈ సినిమాకు 'SIGMA' అనే టైటిల్‌ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు సందీప్‌ కిషన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అందులో గిల్డ్‌ బిస్కెట్లూ, డబ్బుల కట్టల గుట్టపై కూర్చున్న సందీప్‌ కిషన్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించాడు. పోస్టర్‌ డిజైన్‌ చూస్తే మాస్‌, యాక్షన్‌ టచ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి విజయ్‌ స్టార్‌ హీరో అయినప్పటికీ జాసన్‌ మాత్రం తన దృష్టి మొత్తం దర్శకత్వంపైనే పెట్టాడు. ఈ సినిమా హిట్‌ అయితే ఓకే కానీ, దర్శకుడిగా అభిమాన వర్గాన్ని నిర్మించుకోవడం అంత ఈజీ కాదు. అదే హీరోగా మారాలంటే ప్రేక్షకుల మెప్పు కూడగట్టాలి. అప్పుడే తండ్రి విజయ్‌ చరిష్మాను రిపీట్‌ చేయగలడు.

Details

సంగీతాన్ని సమకూర్చనున్న తమన్

ప్రస్తుతం జాసన్‌ దర్శకత్వంపైనే పూర్తి ఫోకస్‌ పెట్టగా, భవిష్యత్తులో నటుడిగా మారుతాడేమో చూడాలి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. సంగీతం తమన్‌ అందిస్తున్నారు. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి, 'SIGMA' సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.