Page Loader
Sundeep Kishan: ధమాకా దర్శకుడితో జతకట్టిన సందీప్ కిషన్ 
Sundeep Kishan: ధమాకా దర్శకుడితో జతకట్టిన సందీప్ కిషన్

Sundeep Kishan: ధమాకా దర్శకుడితో జతకట్టిన సందీప్ కిషన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2024
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఊరు పేరు భైరవకోనతో సందీప్ కిషన్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఈరోజు సందీప్ కిషన్ తన 30వ సినిమాని ప్రకటించారు. ధమాకా వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు త్రినాథరావు నక్కినతో సందీప్ కిషన్ ఇప్పుడు SK30 చేయనున్నాడు. హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సమాజవరగమన,ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌ల తర్వాత, వారి కాంబినేషన్‌లో ఈ సినిమా కోసం మళ్లీ జతకట్టాయి. త్రినాధ రావు నక్కిన, ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ గతంలో చాలా సక్సెస్ అయ్యింది.

Details 

డిఫరెంట్ క్యారెక్టర్ లో సందీప్ కిషన్

వారిద్దరూ కలిసి ధమాకాతో సహా అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఈ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన స్క్రిప్ట్‌లతో అలరించే సందీప్ కిషన్ #SK30 లో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని సమాచారం. గ్రాండ్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందించబడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్