Page Loader
kattalan: విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్!
విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్!

kattalan: విలన్‌గా మళ్లీ సునీల్ ఎంట్రీ.. 'కట్టలన్' పోస్టర్‌తో స్టన్నింగ్ లుక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులకు సునీల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా సినీప్రవేశం చేసి, దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. డ్యాన్సర్ కావాలన్న ఆశయంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సునీల్‌ అనుకోకుండా కామెడీ పాత్రల ద్వారా గుర్తింపు పొందాడు. అతడి హాస్యనటనా విన్యాసాలే అనేక సినిమాలకు విజయావకాశాలు కల్పించాయనడం అతిశయోక్తి కాదు. కమెడియన్‌గా, హీరోగా వరుసగా ప్రేక్షకులను అలరించిన సునీల్‌ 'పుష్ప' చిత్రంలో విలన్ పాత్రలో నటించి ఆశ్చర్య పరిచాడు. ఈ చిత్రం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి శక్తివంతమైన, భిన్నమైన పాత్రలకు అతడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

Details

'కట్టలన్‌'లో సునీల్ కీలక పాత్ర

తాజాగా సునీల్‌ మళయాళ చిత్రమైన 'కట్టలన్‌'లో కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కూడా అతడు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నయా దర్శకుడు పాల్ జార్జ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా హై-యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ నటించబోతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రత్యేక పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సునీల్‌ పూర్తి స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇలా విభిన్న పాత్రలతో తన శైలికి పదునుపెడుతున్న సునీల్‌ 'కట్టలన్‌'లో కూడా మరోసారి మెప్పించనున్నాడు.