Suniel Shetty: పిల్లలకు ఆదర్శం ఉండాలని.. రూ.40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన సునీల్‌శెట్టి
ఈ వార్తాకథనం ఏంటి
కొంతమంది స్టార్ నటులు ఒక్క సినిమాతో వచ్చే సంపాదనకు సరిపడే వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా అదే స్థాయిలో పారితోషికం పొందుతారు. అయితే, కొందరు ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేసే అవకాశం వస్తే, నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్‌శెట్టి (Suniel Shetty) కూడా ఇదే తీర్మానం పాటించినట్లు చెప్పారు. పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఒక ప్రకటనకు ఆయనకు రూ.40 కోట్లు ఆఫర్ వచ్చిందని, కానీ పిల్లలు అహాన్, అతియా కోసం ఆదర్శంగా ఉండాలని భావించి ఆ యాడ్‌ను తిరస్కరించాడని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Details
పిల్లలకు చెడ్డపేరు వస్తుందని చేయలేదు
అలాంటి ప్రకటనల్లో నటించడం వల్ల తన పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నటనకు కొంత కాలం విరామం ఇచ్చిన కారణంపై స్పందిస్తూ, '2014లో నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయనను చూసుకోవడం కోసం కొంత కాలం నటించలేదు. 2017లో నాన్న చనిపోయారు. అదే సమయంలో ఓ రియాలిటీ షో హోస్ట్‌గా చేయాలని అవకాశం వచ్చింది. దాంతో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించాను. గ్యాప్ కారణంగా సెట్స్‌లో కొత్తగా అనిపించేది, అసౌకర్యంగా ఫీలవ్వడం సహజమని సునీల్‌శెట్టి చెప్పారు. సునీల్‌శెట్టి తెలుగులోనూ నటించిన సంగతి తెలిసిందే. ఆయన మంచు విష్ణు 'మోసగాళ్లు', వరుణ్‌తేజ్ 'గని' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.