Sunny Deol: సన్నీ డియోల్ 'జాత్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాత్'.
ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ భారీ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మ్యూజిక్ ను తమన్ అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో సన్నీ డియోల్ పవర్‌ఫుల్ యాక్షన్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Details
మార్చి 10న రిలీజ్
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సన్నీ డియోల్ శరీరమంతా గాయాలతో, రక్తపు మరకలతో భారీ ఫ్యాన్ పట్టుకుని నిలబడి ఉండటం ఆకట్టుకుంది.
ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో హై ఆక్టేన్ డ్రామాగా రూపొందనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ 'జాత్' మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు.
మార్చి 10న ఉదయం 10.35 గంటలకు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.