
Mirai: మిరాయ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. థియేటర్‌లో 'వైబ్ ఉంది' సాంగ్ ప్రదర్శన!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో రిథికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మిరాయ్' ప్రేక్షకుల నుంచి ఘనమైన స్పందన పొందింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు రాబడుతూ, తేజ సజ్జ కెరీర్‌లో మరో 'హైయెస్ట్ గ్రాసర్'గా నిలిచింది. కానీ సినిమా రిలీజ్ రోజు ప్రేక్షకులు ఒక విషయంపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రీ-రిలీజ్ ప్రమోషన్లలో సెన్సేషన్‌గా మారిన 'వైబ్ ఉంది' పాట చిత్రంలో కనిపించకపోవడం వారిని విస్మయానికి గురిచేసింది. యువతా ప్రేక్షకులు ఈ హిట్ పాటను థియేటర్‌లో చూడాలని ఎదురుచూస్తున్నప్పటికీ, అది స్క్రీన్‌పై లేని కారణంగా కొంత డిజప్పాయింట్ అయ్యారు.
Details
ఇవాళ్టి నుంచి ప్రదర్శన
ప్రేక్షుల డిమాండ్‌కు స్పందిస్తూ, చిత్రబృందం సెప్టెంబర్ 23 నుండి 'వైబ్ ఉంది' పాటను ప్రత్యేకంగా సినిమా వెర్షన్‌లో కలుపి థియేటర్లలో ప్రదర్శించనుందని అధికారికంగా ప్రకటించింది. ఫ్యాన్స్ ఈ వార్తను తెలుసుకున్న వెంటనే సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలంగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్సయ్యాం.. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో చూడొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. సైంటిఫిక్ యాక్షన్ మూవీ 'మిరాయ్'లో యువ హీరోలు తేజ సజ్జ, రితికా నాయక్, సీనియర్ నటులు శ్రీయా శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో కనిపించారు.
Details
రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం
సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్: గౌర హరి, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించారు. నిర్మాణ, నటీనటుల, టెక్నీషియన్ ఫీజులు, ప్రచార ఖర్చులు కలిపి ఈ సినిమా రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విడుదలైనప్పటి నుండి ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.