Swayambhu : నిఖిల్ 'స్వయంభు' నుంచి సూపర్ అప్‌డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా 'స్వయంభు'తో తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ ఓ శక్తివంతమైన రాజుగా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండటంతో ప్రారంభం నుంచి భారీ బజ్ క్రియేట్ అయింది. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్లు నెలకొన్నాయి. ఇక తాజాగా బయటకు వచ్చిన వివరాలు ఈ అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రత్యేకంగా నిఖిల్ ఎంట్రీ సీన్ గురించిన క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో వైరల్ అవుతోంది. సాధారణంగా హీరోలు డ్యాన్స్ లేదా ఫైట్‌తో ఎంట్రీ ఇస్తూ కనిపిస్తారు.
Details
సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్న కేకే సెంథిల్ కుమార్
కానీ 'స్వయంభు'లో మాత్రం నిఖిల్ ఒక భీకరమైన యుద్ధం నడుమ ఎంట్రీ ఇస్తారని సమాచారం. శత్రువులపై రాజు రూపంలో దూకుడుగా విరుచుకుపడే ఈ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయి భీకరత, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సీన్ కోసం నిఖిల్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక శిక్షణలు తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాలో విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'బాహుబలి', 'RRR' చిత్రాలకు పనిచేసిన ఆయన విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని యూనిట్ విశ్వాసంగా చెబుతోంది.
Details
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్
అలాగే 'కేజీఎఫ్' ఫేమ్ రవీ బస్రూర్ అందిస్తున్న సంగీతం, ముఖ్యంగా నిఖిల్ ఎంట్రీ సీన్‌లో ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఎనర్జీని రెట్టింపు చేస్తుందని టాక్. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది.