Loading...
Suriya Dhanush: కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ మూవీ
కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ మూవీ

Suriya Dhanush: కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ మూవీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 03, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది సూర్య, ధనుష్‌లను ఒకే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన ఇద్దరు హీరోలకు కథా ఆలోచనను వినిపించారని, వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Details

ఖరారైతే ఇద్దరి కెరీర్‌లో ప్రత్యేక చిత్రమే!

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరోల డేట్స్, షూటింగ్ షెడ్యూల్స్, ఇతర ప్రాథమిక అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కితే సూర్య కెరీర్‌లో 49వ చిత్రంగా, ధనుష్ కెరీర్‌లో 57వ సినిమాగా నిలవొచ్చు.

గతంలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చేయనున్నారనే ప్రచారం జరిగింది.

అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మణిరత్నం పేరు తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది.

Details

సూర్యకు రెండోసారి.. ధనుష్‌కు తొలిసారి!

సూర్యకు మణిరత్నం దర్శకత్వంలో నటించిన అనుభవం ఉంది. గతంలో వచ్చిన 'యువ' (ఆయుత ఎళుత్తు) సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కానీ ధనుష్ మాత్రం ఇప్పటివరకు మణిరత్నం దర్శకత్వంలో నటించలేదు. అందుకే ఈ కాంబినేషన్ ఖరారైతే ఇద్దరికీ ప్రత్యేకత ఉంటుంది.

ప్రస్తుతం మణిరత్నం విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ఇంజి వెల్లమ్' అనే ప్రేమకథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతా, హౌరా బ్రిడ్జి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

Details

నవంబర్‌లో సూర్య, ధనుష్ సినిమాల సందడి

మరోవైపు సూర్య నటించిన 'సీన్' నవంబర్ 6న దీపావళి సందర్భంగా విడుదల కానుంది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా కథానాయికగా నటించారు.

ధనుష్ నటించిన 'ఓం' నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయిక కాగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇలా ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే వీరి కలయికపై వార్తలు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.

అయితే మణిరత్నం మల్టీస్టారర్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను ప్రచారంగానే చూడాలి.

ADVERTISEMENT