Suriya: సూర్య స్పీడ్ మామూలుగా లేదుగా.. ఒకే ఏడాది 3 సినిమాలతో రికార్డ్!
ఈ వార్తాకథనం ఏంటి
సూర్య వరుస విజయాలతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవల కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై దృష్టి పెట్టాడు. వరుసగా చేస్తున్న సినిమాల విషయంలో కథ, కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. గతంలో సూర్య చేసిన ప్రయోగాత్మక చిత్రాలు కంగువా,రెట్రో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. కేవలం ప్రయోగాలు,విభిన్న మేకోవర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడానికి కథలో బలం,కమర్షియల్ అంశాలు కూడా ఉండాలని సూర్యకు అర్థమైంది. దీంతో తనపై ప్రయోగాలు చేయడం కంటే కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
వివరాలు
కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుస విజయాలు
ఈ విధానం అతడికి కలిసొచ్చింది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు.
ఈ సక్సెస్‌ను ఆస్వాదిస్తూనే సూర్య తన తదుపరి సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
సూర్య 47గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్, విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది.
'సీన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీపావళి కానుకగా నవంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
వివరాలు
ఒకే ఏడాదిలో మూడు హిట్స్ అందుకున్న హీరోగా నిలిచే అవకాశం
ఈ సినిమాలో సూర్యను ప్రేక్షకులు విభిన్న గెటప్స్‌లో చూడబోతున్నారు. 'ఆవేశం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్‌తో ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ నమోదు చేసిన సూర్య.. 'సీన్'తో కూడా విజయం సాధిస్తే ఒకే ఏడాదిలో మూడు హిట్స్ అందుకున్న హీరోగా నిలిచే అవకాశం ఉంది.
ఈ ఫీట్‌ను ఈ తరం హీరోల్లో విజయ్ సేతుపతి తర్వాత సాధించిన హీరోగా సూర్య రికార్డు సృష్టించనున్నాడు.
వివరాలు
'సీన్'తో ఈ రికార్డులన్నింటినీ క్రియేట్ చేస్తాడా?
అంతేకాదు.. 'సీన్' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల మార్క్‌ను అందుకుంటే మరో అరుదైన ఘనత సూర్య ఖాతాలో చేరనుంది.
కోలీవుడ్ చరిత్రలో రూ.200 కోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకున్న తొలి హీరోగా సూర్య కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుంది.
ఇక్కడితో రికార్డుల జాబితా ఆగదు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు చెందిన దర్శకులతో వరుసగా సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తొలి తమిళ హీరోగా కూడా సూర్య నిలిచే అవకాశం ఉంది.
కాబట్టి సూర్య 'సీన్'తో ఈ రికార్డులన్నింటినీ క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది దీపావళికి తేలనుంది.