LOADING...
Suriya: విజయకాంత్ కు నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమైన సూర్య 
Suriya: విజయకాంత్ కు నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమైన సూర్య

Suriya: విజయకాంత్ కు నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమైన సూర్య 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2024
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్‌ నటుడు,డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన నటుడు సూర్య గురువారం ఆయనకు నివాళులర్పించారు. కంగువ షూటింగ్‌ కారణంగా విదేశాలలో ఉన్న సూర్య విజయకాంత్ కి తుది నివాళి అర్పించేందుకు రాలేకపోయారు. చెన్నైకి వచ్చిన తరువాత ఆయన.. విజయకాంత్‌ సమాధి వద్ద అంజలి ఘటించారు. 'కెప్టెన్‌'ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.

Details 

పెరియన్న చిత్రంలో కలిసి నటించిన  సూర్య, విజయకాంత్ 

అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్య.. 'చివరిసారిగా ఆయన ముఖాన్ని చూడలేకపోయాను అనే అపరాధభావం నాలోనూ, కార్తీలోనూ జీవితాంతం ఉంటుంది. నేను అయన నుండి చాలా నేర్చుకున్నాను. నేను ఆయనను చూసి చాలా ఫాలో అవుతున్నాను. అయన నన్ను చెక్క కుర్చీపై మాత్రమే కూర్చోమని చెప్పారు, నేను ఈ రోజు వరకు దానిని అనుసరిస్తున్నాను... సెట్స్‌లో, అయన ఉపయోగిస్తున్నట్లుగానే ఒక కుర్చీ ఉంటుంది. ఆయన మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సూర్యతో పాటు ఆయన తండ్రి శివకుమార్ కూడా విజయకాంత్‌కు నివాళులర్పించారు. పెరియన్న (1999) చిత్రంలో సూర్య, విజయకాంత్ కలిసి నటించారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

విజయ్ కాంత్ కి నివాళి అర్పిస్తున్న సూర్య 

Advertisement