Loading...
VishwanathAndSons : రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'
రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'

VishwanathAndSons : రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'

వ్రాసిన వారు Moogati Shabari
Aug 16, 2026
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్సటైల్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఏకగ్రీవంగా మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఈ అరుదైన కలెక్షన్లను తెలియజేస్తూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

వివరాలు

నటనతో ఆకట్టుకున్న మమితా బైజు..

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది.

పలు ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తుండగా.. కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు.

సినిమా విజయానికి సూర్య నటన ప్రధాన బలంగా నిలిచిందని చెప్పొచ్చు.

ఆయన వన్-మ్యాన్ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, మమితా బైజు తన నటనతో సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చారు.

మరోవైపు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా కథకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

వివరాలు

రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌..

మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌కు కూడా సినిమా బాగా కనెక్ట్ కావడంతో ఈ వారాంతంలో మరిన్ని భారీ రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు సెలవు రోజు కావడంతో ఉదయం ఆటల నుంచే పలు థియేటర్లలో హౌస్‌ఫుల్స్ మొదలయ్యాయి.

ప్రేక్షకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫస్ట్, సెకండ్ షోలకు అదనంగా మరికొన్ని సెంటర్లలో స్క్రీన్లను జోడిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

ADVERTISEMENT