Loading...
Ram Charan: 'రంగస్థలం'కు మించి.. రామ్‌చరణ్‌ ఊరమాస్‌ లుక్‌తో సుకుమార్‌ మరోసారి సెన్సేషన్‌!
'రంగస్థలం'కు మించి.. రామ్‌చరణ్‌ ఊరమాస్‌ లుక్‌తో సుకుమార్‌ మరోసారి సెన్సేషన్‌!

Ram Charan: 'రంగస్థలం'కు మించి.. రామ్‌చరణ్‌ ఊరమాస్‌ లుక్‌తో సుకుమార్‌ మరోసారి సెన్సేషన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పెద్ది' వంటి హిట్‌ తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం RC17పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'రంగస్థలం' తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

వివరాలు

15 కిలోలు తగ్గనున్న చరణ్‌?

RC17లో రామ్‌చరణ్‌ ఇప్పటివరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. పాత్ర అవసరాల కోసం ఆయన ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది.

అల్ట్రా లీన్‌ అండ్‌ మాసీ అవతారంలోకి మారనున్న చరణ్‌.. స్లిమ్‌ లుక్‌తో పాటు పొడవాటి జుట్టుతో సరికొత్త మేకోవర్‌లో దర్శనమివ్వనున్నారని సమాచారం.

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు దర్శకుడు సుకుమార్‌ ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

స్క్రిప్ట్‌ పనులు చివరి దశలో..

RC17కు సంబంధించిన స్క్రిప్ట్‌ పనుల్లోనూ కీలక పురోగతి చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా మొదటి భాగం స్క్రిప్ట్‌ పూర్తిగా లాక్‌ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సెకండ్‌ హాఫ్‌కు సంబంధించిన క్లైమాక్స్‌ ఫైనల్‌ డ్రాఫ్ట్‌ సిద్ధం చేసే పనిలో సుకుమార్‌ టీమ్‌ నిమగ్నమైందని సమాచారం.

ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేసే సాంకేతిక వర్గంలోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ADVERTISEMENT

వివరాలు

హీరోయిన్‌ ఎవరంటే?

ఇక RC17 కథానాయిక విషయంలోనూ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. రామ్‌చరణ్‌కు జోడీగా కన్నడ నటి రుక్మిణి వసంత్‌ నటించనున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. చరణ్‌ సరసన సరైన కథానాయికను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం కాస్టింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోందని సమాచారం.

త్వరలోనే హీరోయిన్‌ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

'రంగస్థలం'తో బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చరణ్‌-సుకుమార్‌ జోడీ.. ఈసారి ఆ మ్యాజిక్‌ను మించి మరో భారీ విజయాన్ని అందుకునేందుకు సిద్ధమవుతోంది.

ADVERTISEMENT