Tamannaah-Vijay Varma : వాలెంటైన్స్ డే రోజే సర్‌ప్రైజ్.. కొత్త యువతితో విజయ్ వర్మ ఫోటో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
కొంతకాలంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదని, ఇద్దరూ విడిపోయారనే ప్రచారం ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ చేసిన ఒక పోస్ట్ ఈ బ్రేకప్ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గుర్తు తెలియని యువతితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'హ్యాపీ వాలెంటైన్స్ డే ఫరెవర్' అంటూ క్యాప్షన్ ఇవ్వడం చర్చకు దారితీసింది. దీంతో తమన్నాతో ఉన్న బంధానికి ముగింపు పలికి, విజయ్ కొత్త ప్రేమకథ ప్రారంభించాడని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు.
Details
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఆ ఫోటో క్షణాల్లోనే వైరల్ కావడంతో 'మిల్కీ బ్యూటీ' అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిణామంలో మరో కోణం కూడా వినిపిస్తోంది. విజయ్ వర్మ ట్యాగ్ చేసిన అకౌంట్ అసలు వ్యక్తికి చెందినది కాకపోవచ్చని, అది ప్రాంక్ లేదా ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ భాగం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నెటిజన్లు, ఆ అకౌంట్ వివరాలు పరిశీలించిన తర్వాత ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అయి ఉండొచ్చని భావిస్తూ లైట్‌గా తీసుకుంటున్నారు. ఏది ఏమైనా, తమన్నా-విజయ్ బంధంపై వస్తున్న ఈ పుకార్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.