LOADING...
Suyodhana: థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్..రెండు ఓటీటీల్లోకి 'సుయోధన'
థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్..రెండు ఓటీటీల్లోకి 'సుయోధన'

Suyodhana: థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి గుడ్ న్యూస్..రెండు ఓటీటీల్లోకి 'సుయోధన'

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి ప్రచారం లేకుండా మెల్లగా రెండు ఓటీటీ వేదికలపైకి వచ్చిన చిత్రం 'సుయోధన'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 17) నుండి 'జియో హాట్‌స్టార్', 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ప్రసారం అవుతోంది. హాట్‌స్టార్‌లో ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ద్రిషిక చందర్ హీరోయిన్‌గా కనిపించిన ఈ చిత్రంలో సాయికుమార్, ప్రేమ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు మాధవ్ రెడ్డి రూపొందించిన ఈ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలైంది.

వివరాలు

ఈ కథ ఏమిటంటే?

వరుణ్ (ప్రియదర్శి) వృత్తిరీత్యా సౌండ్ డిజైనర్. చిన్ననాటి నుండి 'సుయోధన' అనే పదం వినిపించిన ప్రతిసారి అతనికి దుర్యోధనుడు కనబడుతున్నట్లుగా అనిపిస్తుంది. వరుణ్ తండ్రి ప్రకాశ్ (సాయికుమార్) నాటకాలలో నటిస్తూ, ముఖ్యంగా దుర్యోధనుడి పాత్రను ఎంతో ఇష్టంగా పోషిస్తుంటాడు. ఈ విషయం వల్ల వరుణ్ భయపడుతున్నాడని అతని తల్లి, వైద్యులు భావించడంతో ప్రకాశ్ నాటకాల నుంచి దూరమవుతాడు.

వివరాలు

కథ సాగుతుందిలా..

తన భయం తగ్గిపోయిందని నమ్మిన వరుణ్ స్వంతంగా స్టూడియో నిర్వహిస్తూ ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఒక రోజు సమిత (ద్రిషిక) తన డెమో ఫిల్మ్ షూట్ కోసం వరుణ్ స్టూడియోకు వస్తుంది. ఆమె తీసిన దృశ్యాల్లో ఒక పాత్ర వరుణ్‌కు మళ్లీ దుర్యోధనుడిలా కనిపిస్తుంది. అప్పుడు ఏదో అపాయం సమీపిస్తున్నదని అతనికి అనుమానం కలుగుతుంది. చివరకు వరుణ్ ఎదుర్కొన్న ప్రమాదాలు ఏమిటి? అతనికి 'సుయోధన' అనే శబ్దం వినిపించడానికి అసలు కారణం ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

Advertisement