LOADING...
Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ శుభవార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకోవడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంలో తన నివాసంలో జరిగిన వేడుకల వీడియోను ఉపాసన షేర్ చేశారు. ఆ వీడియో ద్వారా తాను గర్భవతిననే విషయాన్ని ఆమె సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని రోజులకే, కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం వేడుక ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. ఈ వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది.

వివరాలు 

వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

ఈ సందర్భానికి మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు, కామినేని కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం, ఈ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఉపాసన చేసిన ట్వీట్