LOADING...
Vishnupriya : యాంకర్ల మధ్య సిండికేట్ జరుగుతుంది.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు!
యాంకర్ల మధ్య సిండికేట్ జరుగుతుంది.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు!

Vishnupriya : యాంకర్ల మధ్య సిండికేట్ జరుగుతుంది.. విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ, టీవీ రంగాల్లో ఎదుగుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఈ విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకున్నారు కూడా. కొత్తవాళ్లు అవకాశాలు దక్కించుకుంటే తమ ప్రాధాన్యం తగ్గిపోతుందనే భావనతో కొందరు వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారట. అలాంటి పరిస్థితులు టాలీవుడ్ యాంకర్ల మధ్య కూడా ఉన్నాయని తాజాగా వెలుగులోకి వస్తోంది. తెలుగు పరిశ్రమలో యాంకర్ల సంఖ్య ఎక్కువే. ప్రతీ సంవత్సరం కొత్త యాంకర్లు రంగప్రవేశం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ యాంకర్ల మధ్య జరిగే వ్యాఖ్యలు, వాదోపవాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల సీనియర్ యాంకర్, నటి ఉదయభాను ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇక్కడ యాంకర్లలో పెద్ద సిండికేట్ జరుగుతుంది.

Details

కొంతకాలంగా యాంకరింగ్ కు దూరమైన విష్ణుప్రియ

అన్ని ఛాన్సులు మాకు రావు. అదృష్టం ఉన్నవారికే అవకాశాలు దక్కుతాయని చెప్పడంతో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె మాటలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ యాంకర్ సౌమ్య కూడా స్పందించారు. ఉదయభాను చెప్పింది నిజమే. యాంకర్లలో సిండికేట్ వందశాతం ఉందని చెప్పింది. దీంతో టాలీవుడ్‌లో కొత్త యాంకర్లకు అవకాశాలు ఇవ్వడం లేదా? అన్ని షోలు కొంతమందే పంచుకుంటున్నారా? అనే చర్చ మొదలైంది. ఇప్పుడు అదే విషయంపై యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ టాపిక్‌ని హాట్‌గా మార్చాయి. పోవే పోరా షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ, ఆ తరువాత పలు ఫెస్టివల్ స్పెషల్ షోలలో కూడా యాంకరింగ్ చేసింది. అయితే కొంతకాలంగా ఆమె యాంకరింగ్ నుంచి దూరంగా ఉంది.

Details

రెగ్యులర్ చేయడం లేదు

తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడేం యాంకరింగ్ చేయడం లేదు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పింది. నా తోటి యాంకర్లు నా మీద కుళ్లు పెట్టుకున్నారు. 'ఇది కొత్తగా వచ్చి వెంటనే పాపులర్ అయిపోయింది, మేము కష్టపడ్డా అంత పేరు రాలేదని భావించారు. వాళ్లు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు. అంతేకాక యాంకరింగ్ పూర్తిగా రాదు. అప్పట్లో సుధీర్ ఉన్నందువల్ల వర్కౌట్ అయ్యింది. నా వీక్‌నెస్ నాకు తెలుసు. అందుకే రెగ్యులర్‌గా చేయడం లేదు, అప్పుడప్పుడు మాత్రమే చేస్తా" అని విష్ణుప్రియ చెప్పింది.

Details

టాలీవుడ్ యాంకర్ల మధ్య అంతర్గత విభేదాలు

ఆమె ఈ వ్యాఖ్యలతో మళ్లీ చర్చ మొదలైంది. విష్ణుప్రియ ఎదుగుదల చూసి కుళ్లుకున్న యాంకర్లు ఎవరో అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి టాలీవుడ్ యాంకర్ల మధ్య అంతర్గత గోడలు ఉన్నాయా? కొంతమందిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణల్లో నిజం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మళ్లీ జోరుగా సాగుతోంది. ఇక ఈ వ్యాఖ్యలపై ఇతర యాంకర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.